సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య

Jul 31 2025 7:16 AM | Updated on Jul 31 2025 9:08 AM

సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య

సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్‌ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్‌ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్‌ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్‌ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వినోద్‌కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు.

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

జగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్‌పూర్‌కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్‌ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్‌పూర్‌ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్‌ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు.

హాస్టల్‌ నుంచి పారిపోయిన విద్యార్థులు

స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత

మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్‌ గురుకులం విద్యార్థులు హాస్టల్‌ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్‌ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్‌ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్‌కు అప్పగించారు. హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇరువర్గాలపై కేసు

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చే సిన ట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఎస్సై కథ నం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం అల్లిపూ ర్‌ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్‌ జిల్లా చర్లబూత్కూర్‌కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్‌కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్‌, ఏరుకొండ వినోద్‌తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్‌ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సు బ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్‌ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్‌ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయ మై సీఐని సంప్రదించగా భూసమస్యపై ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement