
కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు
మంథని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరా టాలు చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యద ర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్‌లో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాలుగో మహాసభ నిర్వహించారు. తొలుత మున్సిపల్ సీనియర్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడారు. రానున్నకాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కా రానికి రాజీలేని పోరాటాలు చేస్తామని, ఇందుకో సం కార్మిక వర్గం మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేశ్, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆర్ల సందీప్, కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటియూ నేత ముత్యంరావు