
భూ భారతి దరఖాస్తులు పరిష్కరిస్తాం
● మంథని ఆర్డీవో సురేశ్
ముత్తారం(మంథని): భూభారతి దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని మంథని ఆర్డీవో సురేశ్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో సోమవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ మూడో తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలతో మూడు బృందాలుగా విభజించి సదస్సలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 1,478 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోకాపైకి వెళ్లి 608 దరఖాస్తులపై విచారణ చేశామని, మోకాపై పంచనామా చేసి ఉన్న రైతులను గుర్తించి, లేనివారికి నోటీసులు అందజేస్తున్నామన్నా రు. భూభారతి దరఖాస్తుదారులు గ్రామాలకు అధికారులు వస్తే సహకరించాలని కోరారు. తహ సీల్దార్ మధుసూదన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షఫీ, ఆర్‌ఐ రాజబాబు, సిబ్బంది పాల్గొన్నారు.