
శ్రావణ పూజలు
పండుగలను మోసుకొచ్చేది శ్రావణం. శివభక్తులకు ప్రీతికరమైన మాసం. భక్తి, మనసుతో భగవానుడిని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉపవాసాలు పాటించి, వ్రతాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని విశ్వాసం. అందుకే శ్రావణాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే నెలగా మహి ళలు కొలుస్తారు. ఈ సందర్భంగా శుభకార్యాలు, వివాహాలు, వ్యాపారాలు.. ఇలా మంచి పనులు అన్నీ కూడా శ్రావణంలో చేపడితే శుభాలు కలుగుతాయని నమ్మకం. శివపూజలకు విశిష్టమైన మాసం కావడంతో పెద్దపల్లిలోని శివాలయం, హనుమాన్ ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అవే ఈ చిత్రాలు.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

శ్రావణ పూజలు