
ఏకాగ్రతతో చదివి లక్ష్యం అధిగమించాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ల క్ష్యం అధిగమించాలని ఎమ్మెల్యే విజయరమణారా వు సూచించారు. స్థానిక అమర్‌చంద్ కల్యాణ మండపంలో పద్మశాలీ సంఘం జిల్లా అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన 35 మంది విద్యార్థులను ఆదివారం సత్కరించారు. ఎమ్మెల్యే మాటాడుతూ, పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు. ఆర్డీవో గంగయ్య, అడ్‌హక్ కమిటీ కన్వీనర్ నీలయ్య, నాయకు లు వాసాల రమేశ్, సుధాకర్, రాజేశ్, లక్ష్మీనారా యణ, సదానందం, చందు, బత్తుల రమేశ్, రాయమల్లు పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ సమీపంలోని ఫిర్దౌస్ మసీదు షాపింగ్ కాంప్లెక్స్‌ను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి, నాయకులు జావీద్, ఎంఏ మొయిద్, హాదీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించా రు. ఏఎంసీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఓదెల(పెద్దపల్లి): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్ర జాప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. ఇందుర్తి, గుంపుల, గూడెం గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఆయన ముగ్గు పోశారు. అభివృద్ధి పనులకు శంకుస్తాపన చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేశామని తెలిపారు. నాయకులు మూల ప్రేంసాగర్‌రెడ్డి, సిరిశేటి రాహుల్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు