
భూమిపూజకు వేళాయె
● నేటినుంచి ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు ● పనులు చేపట్టేందుకు సన్నద్ధమైన లబ్ధిదారులు ● మంచిముహూర్తాలు ఉండడమే కారణమంటున్న పేదలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం నుంచి ముగ్గుపోసే కార్యక్రమాలు చేపట్టేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు. మొన్నటివరకు ఆషాడ మాసం కొనసాగడంతో మంచిముహూర్తాలు లేవని కొందరు ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించలేదు. అయితే, సోమవారం నుంచి అన్నీమంచి రోజులేనని వేదపండితులు సూచించడంతో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందుకున్న లబ్ధిదారులు ముగ్గు పోసేందుకు సిద్ధమవుతున్నారు.
నియోజవర్గానికి 3,500 ఇళ్లు..
జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారులను ఎంపికచేసిన అధికారులు.. ఇటీవల వారికి ప్రొసీడింగ్స్ కూడా అందజేశారు. ఇంటి నిర్మాణ పత్రం అందుకున్న లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది.
మూడు విడతల్లో డబ్బులు జమ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ విస్తీర్ణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలనే నిబంధన ఉంది. ఇంటి నిర్మాణం తొలిదశ నుంచి చివరివరకూ ప్రతీస్థాయి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తామని హౌసింగ్ పీడీ రాజేశ్వర్ తెలిపారు. తొలివిడత బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రెండోదశ పిల్లర్ స్థా యిలో రూ.లక్ష, మూడోదశలో బిల్డింగ్ స్లాబ్ స్థా యిలో రూ.2 లక్షలు. నాలుగో విడతలో భవన ని ర్మాణం పూర్తయ్యాక.. చివరగా రూ.లక్షను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.