
శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు
రామగిరి(మంథని): మంథని జేఎన్టీయూలో చేప ట్టిన టీసీఎస్ శిక్షణ తరగతులను న్యూ ఢిల్లీకి చెంది న టీసీఎస్ అధిపతి ఇందిరా బసు ఆదివారం పరిశీలించారు. వంద మంది విద్యార్థులకు 20 వారాలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. శిక్షణ తీరు, సౌకర్యాలపై ఇందిరా బసు ఆరా తీశారు. ప్రతిభ కలిగిన వంద మందిని ఎంపికసి శిక్షణ ఇస్తున్నామని, ప్రతీ శనివారం మౌఖిక తరగతులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 18 వారాల పాటు లెర్నింగ్ ఇస్తామని, మిగతా రెండు వారాలు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పి స్తామని తెలిపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి మాట్లాడి సహపంక్తి భోజనం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్‌కుమార్, టీసీఎస్ ప్రోగ్రాం మేనేజర్ సుబోత్ చంద్ర, సబ్జెక్టు నిపుణులు సిమాంటిసేన్, ఆపరేషన్ లీడర్ వంశీ, ప్రాజెక్టు మేనేజర్ రఘువీర్, బోధకులు రవితేజ, త్రినాథ్, సీఎస్‌ఈ అధిపతి తిరుపతి, పరిపాలనాధికారి సుమన్ పాల్గొన్నారు.