
స్కూల్ విద్యార్థులకు వేడి భోజనం వడ్డించాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): విద్యార్థులకు వేడి భోజనం వడ్డించాలని గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ తిరుపతి సూచించారు. భూపతిపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర విద్యాలయాన్ని ఆదివారం అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, స్టోర్ రూం, తరగతి గదులు ఆయన పరిశీలించారు. భోజనంపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతీరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాజేశం, సిబ్బంది ఉన్నారు.