
అవును.. ఇది ఉప కాల్వే..
కమాన్‌పూర్(మంథని): అవును ఈ ఫొటోలో ఉన్నది కాల్వే..మండలపరిధిలో పంటలకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ కాల్వలు పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ నుంచి సాగునీరు అందించే డీ–83 కెనాల్ పరిధిలోని ఎల్–36, ఎల్–37 ఉపకాల్వల్లో చెట్లు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డీ–83 కెనాల్‌కు నీరు విడుదల చేస్తే ఉపకాల్వల ద్వారా ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు. వేసవిలో ఉప కాల్వల్లో చెట్ల తొలగింపు, పూడిక తీయించాల్సి ఉండగా ఆ పనులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.