
భళా.. హస్తకళ మేళా
కోల్‌సిటీ(రామగుండం): చూడచక్కని బొమ్మలు, ఆకట్టుకునే ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి చీరలు, ఉడన్ హ్యాండీ క్రాఫ్ట్స్, ఒడిశా పేయింటింగ్, జైపూర్ స్టోన్ జ్యూవెల్లరి, హరియాణా బెడ్ కవర్స్, కోల్‌కత్తా బ్యాగ్స్.. కళ్లు మిరుమిట్లు గొలిపే వస్తువులకు గోదావరిఖని వేదికయింది. ఆధునిక సొబగులద్దుకుంటున్న సంప్రదాయ హస్తకళను హైదరాబాద్‌కు చెందిన ‘కళా సిల్క్ చేనేత హస్తకళా సొసైటీ’ ప్రత్యేక మేళాను గురువారం గోదావరిఖనిలో ప్రారంభించింది. సింగరేణి కమ్యూనిటీ హాల్లో హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయా రు చేసిన హస్తకళలను ప్రదర్శనకు పెట్టారు.
ఆకట్టుకుంటున్న చీరలు
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టు చీరలతోపాటు ఏపీలోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కళంకారి, ఉప్పాడ, అస్సాం మూగా, బిహార్ బాగల్పుర సిల్క్స్, టస్సర్, జమ్మూకశ్మీర్‌లోని ఎంబ్రాయిడరీ చీరలు, గుజరాత్‌లోని బాందని, కచ్చ ఎంబ్రాయిడరీ శారీస్, రాజాస్థాన్‌లోని కోటా, బంధాని, ఉత్తరప్రదేశ్‌లోని జమ్దాని, బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్, ఛత్తీస్‌గఢ్ ట్రిబిల్ వర్క్స్ కోసా సిల్క్, ఫ్యాన్సీ చీరలు, చుడీదార్స్, హ్యాండి క్రాఫ్ట్స్, హ్యాండ్‌లూమ్స్ ఆకట్టుకుంటున్నాయి.
మేళాలో చేనేత, హస్తకళ స్టాల్స్
కళాకారులను ప్రోత్సహించాలి
చేనేత వస్త్రాలు, హస్తకళలు, హ్యాండ్‌లూమ్స్ కళాకారులను ప్రోత్సహించాలి. మా సొసైటీ ద్వారా పలు రాష్ట్రాల్లోని చేనేత, హ్యాండ్రీక్రాఫ్ట్స్ కళాకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఇలా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. – వినోద్‌సింగ్ నెగి,
కళాసిల్క్ సొసైటీ మేనేజర్

భళా.. హస్తకళ మేళా

భళా.. హస్తకళ మేళా