
వానొచ్చింది.. వరదొచ్చింది
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ఎలిగేడు/ఓదెల: జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల పంటలు నీటమునిగాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని రైల్వే క్రాసింగ్ గేటును మూసివేసి అండర్‌బ్రిడ్జి నిర్మించగా, బ్రిడ్జి వద్ద మోకాలిలోతు నీటిలో వాహనదారులు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ఎలిగేడు మండలంలో పంటపొలాలు నీటమునిగాయి. ఓదెల మండలంలో గోపరపల్లె చెరువు మత్తడి పడడంతో మత్స్యకారులు చేపలు పట్టారు. అలాగే ఓదెల–కొలనూర్ గ్రామాల మధ్యలో తారురోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వానొచ్చింది.. వరదొచ్చింది

వానొచ్చింది.. వరదొచ్చింది