
మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ
● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే ఏకై క పరిష్కారమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బల్దియా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే మొక్కలు నాటి మాట్లాడారు. నగరంలో పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముగ్గులువేసి చెత్తపై అవగాహన
గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో చెత్త జమయ్యే ప్రాంతాలను పారిశుధ్య విభాగం సిబ్బంది శుభ్రం చేసి ముగ్గులు వేశారు. బయట చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని అవగాహన కల్పించారు. మల్లికార్జున్‌నగర్‌లోని మేజర్ కాలువలో పూడిక తొలగించే పనులు చేపట్టారు. కేసీఆర్‌కాలనీలో పిచ్చిచెట్లు తొలగించారు. నగరపాలక డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, డీఈ షాభాజ్, ఏఈ తేజస్విని, ప్రిన్సిపాల్ సంజీవ్ పాల్గొన్నారు.