
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
ధర్మారం(ధర్మపురి): గురుకులం విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. గురువారం ధర్మారం మండలం మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డైనింగ్‌హాల్, టాయిలెట్స్, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. పరిసరాల్లో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న డైనింగ్‌హాల్‌కు నిధులు మంజూరు చేస్తానని వెంటనే మరమ్మతు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిధులు కేటాయించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, నాలుగు నెలల పాటు నెలలో రెండుసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలోనే మల్లాపూర్ గురుకులం విద్యాలయానికి మంచి పేరుందని, ఆ పేరును ఉపాధ్యాయులు కాపాడాలని కోరారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మాధవి, మెస్ ఇన్‌చార్జి రత్నాప్రసూన్న, నియోజకవర్గ యువకాంగ్రెస్ అధ్యక్షుడు అసోద అజయ్, గందం మల్లయ్య, గందం మహిపాల్, రామడుగు గంగారెడ్డి, రాజు, శివ పాల్గొన్నారు.
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్