
కార్మికులను ఆదుకోవాలి
గోదావరిఖని: సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రమాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్ కోరారు. హైదరాబాద్‌లో సీఎండీడ్‌ఎండీ బలరాంతో బుధవారం భేటీ అయ్యా రు. మెడికల్ బోర్డుకు రెఫర్‌చేసిన ఉద్యోగులను ఏడాదిగా అన్‌ఫిట్ చేయడంలేదని, కనీసం విధులకు అనుమతించడం లేదన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, బీపీ, షుగర్ త దితర మందులను అందుబాటులో ఉంచాలన్నా రు. కొత్త గనులు ఏర్పాటు చేయాలని, భూగర్భ గనులు, ఓసీపీల్లో యంత్రాలను కొనుగోలు చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని విన్నవించారు. పాతయంత్రాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు గతేడాది సాధించిన లాభాలు ప్రకటించి, కార్మికుల వాటా చెల్లించాలని కోరారు. స్పందించిన సీఎండీ.. కార్మికులకు గతం కన్నా ఎక్కు వ లాభాలే వస్తాయని వెల్లడించారు. మాజీ ఎ మ్మెల్యేలు హరిప్రియ నాయక్, పుట్ట మధు, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె డ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్