
నాలుగు రోజులైతంది
కాళ్లకు పుండ్లు అ యినయి. వాంతులవుతున్నయి. పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చిండ్రు. నాలుగు రోజులైతంది. ఐనా జెరం తగ్గుతలేదు. పరీక్షలు చేసిన వైద్యులు జెరం తగ్గేవరకు ఆస్పత్రిలోనే ఉండాలన్నరు.
– కలవేని రాయమల్లు, కొత్తపల్లి
వారం నుంచి జ్వరం
వారంరోజుల కింద జెరం వచ్చింది. స్థాని క వైద్యుడి కాడికిపో యిన. మందులిచ్చిండ్రు. వాడినా తగ్గలే దు. అందుకే పెద్దపల్లి ఆస్పత్రిలో చేరిన. అన్ని పరీక్షలు చేసిండ్రు. ఇ క్కడే ఉంచి చికిత్స అందిస్తున్నరు. జెరం కొ ద్దిగా జారింది. – బోయిని లచ్చమ్మ, వెన్నంపల్లి
వాంతులు.. విరోచనాలు
ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్న. వాంతులు, విరోచనాలతో స్థాని క ఆస్పత్రిలో చేరిన. తగ్గలే. అందుకే గోదావరిఖని జనరల్ ఆస్పత్రికి వచ్చిన. ఆ తర్వాత జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గుతలేదు. అలసటగా ఉంది.
– కనుకుంట్ల శ్రీనివాస్, గోదావరిఖని

నాలుగు రోజులైతంది

నాలుగు రోజులైతంది