
వేతనాలు అందక ఇబ్బందులు
● జీతాలు ఇప్పించాలని డీపీవోకు విన్నవించిన సిబ్బంది
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: జిల్లాలో పనిచే స్తున్న ఈ – పంచాయతీ ఆపరేటర్లకు మూడు నె లలుగా వేతనాలు అందడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రతీఉత్తరాన్ని, ప్రత్యుత్తరాన్ని వీరి ద్వారానే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నివేదిస్తారు. అయితే, ప్రభుత్వాల ద్వారా నిధులు విడుదల కాకపోవడంతో వేతనాల చెల్లింపులు ఆగిపోయాయని అంటున్నారు. గతేడాది వరకు నెలకు రూ.22,750 ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి రూ.19,500 వేతనం వస్తోందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవికూడా మూడునెలలుగా అందడం లేదంటున్నారు. 20 15 నుంచి విధులు నిర్వర్తిస్తున్న తమకు వెంటనే మూడు నెలల బకాయిలు విడుదల చేయాలని బుధవారం డీపీవోతోపాటు ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు.