
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి ● మురుగునీటి నిల్వలు తొలగించాలి ● దోమలను నివారించాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామస్థాయిలోనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలి సి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సి న చర్యలపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్ వేసి దో మలను నియంత్రించాలన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు అందించేలా ఏర్పా ట్లు చేసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి, డీఎల్‌పీవో వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యా రు. భూసంబంధ సమస్యలపై అందిన దరఖా స్తులు పరిష్కరించాలని మంత్రి సూచించారు. భూభారతి ప్రకారం దరఖాస్తులను 4 కేటగిరీలు గా విభజించి పరిష్కరించాలన్నారు. రెసిడెన్షియ ల్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఆర్డీవో గంగయ్య, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, డీఎఫ్‌వో శివయ్య ఉన్నారు.