
భూపాలపల్లి నుంచి వచ్చిన
పెద్దపల్లి సర్కార్ దవాఖానలో మంచిగ చూస్తుండ్ర ని తెలుసుకున్న. నాకు కంటి ఆపరేషన్ అవస రం కావడంతో భూపాలపల్లి నుంచి వచ్చిన. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేసిండ్రు. ప్రైవేట్ దవాఖాన కన్నా సర్కార్ ఆస్పత్రిల మంచిసౌలతులున్నయ్.
– తుపాకుల లక్ష్మి, భూపాలపల్లి
పేషెంట్ల సంఖ్య పెరిగింది
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కంటి వైద్యం కోసం వచ్చే పేషంట్ల సంఖ్య పెరిగింది. డాక్టర్ సబిహతో కలిసి అవసరమైన వారికి ఆపరేషన్లు ఇక్కడే చేస్తున్నాం. జిల్లానుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. నాణ్యమైన ఇంపోర్టెడ్ లెన్స్‌లనే ఆపరేషన్లలో ఉపయోగిస్తున్నాం.
– సింధూర, నేత్రవైద్య నిపుణురాలు
మెరుగైన సేవలందిస్తున్నాం
జిల్లా ప్రధాన ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. కంటి జబ్జుతో బాధపడేవారికి ఇతర ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు జరిగేవి. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇక్కడే ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రతీనెల 100 నుంచి 120 దాకా ఆపరేషన్లు జరుగుతున్నాయి.
– శ్రీధర్, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్

భూపాలపల్లి నుంచి వచ్చిన

భూపాలపల్లి నుంచి వచ్చిన