
బోనాల జాతరలో ఎమ్మెల్యే
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదివారం జరిగిన బోనా ల ఉత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఉత్సవాల సందర్భంగా విజయదుర్గామాత ఆలయంలో పూజలు చేశారు.
ముందస్తు పరీక్షలే మేలు
రామగుండం: క్యాన్సర్ మహమ్మారి బారినప డకుండా ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించడమే మేలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అ ధ్యక్షుడు పెండ్యాల మహేశ్, సీఐ ప్రవీణ్‌కు మార్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో త్రిదండి చిన్నజీయర్‌స్వామి వికాస త రంగిణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామీ ణ మహిళలకు గర్భకోశ, సర్వైకల్ క్యాన్సర్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ హారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతో నే ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. మహిళలు ఏటా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ సంపూర్ణ ఆ రోగ్యంగా ఉండాలని సూచించారు. మహిళా ఆరోగ్య వికాస్ సేవకులు పద్మ, లక్ష్మీ, ప్రసన్నలక్ష్మీ, మధుమిత, స్థానిక ప్రతినిధులు దీపిక, మాధవి, కవిత, లక్ష్మీ, సుకన్య, శారద, రమ, అంజలి, ప్రేమలత, పెద్దంపేట మాజీ సర్పంచ్ ఆముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
మొక్కలు నాటుదాం
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విరివిగా మొక్కలను నాటాలని బీజేపీ పర్యావరణ పరిరక్షణ విభాగం జిల్లా అధ్యక్షు డు జంగ చక్రధర్‌రెడ్డి అన్నారు. పలువురు నా యకులతో కలిసి ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగంతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలను నాటి కాపాడడమే పరిష్కారమన్నారు. కాలుష్యకారకాలను నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దో హదపడే మొక్కలను నాటాలని కోరారు. మో దీ ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ పల్లె సదానందం, నాయకులు మౌఠం నర్సింగం, మేరుగు రవీందర్, గనెబోయిన రాజేందర్, ముస్త్యాల సంతోష్, కాసనగొట్టు విజయ్, రాజం కొముర య్య, బూతగడ్డ నరేశ్, సారయ్య ఉన్నారు.
చదరంగంతో మేధస్సు
పెద్దపల్లిరూరల్: మేధాశక్తిని పెంపొందించే చ దరంగం అని, దీనిపై ఆసక్తి పెంచేందుకు జి ల్లా చదరంగ సమాఖ్య పాటుపడుతోందని స మాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డాల శ్రీ నివాస్, భానువిజయానంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రీ విద్యానికేతన్‌లో ఆదివారం జిల్లాస్థాయి చదరంగ పోటీలు నిర్వహించారు. మెదడుకు మేత పెట్టే చదరంగం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అన్నారు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించి మేధస్సును పెంచే చెస్‌పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. విజేతలుగా నిలిచిన వారికి నగదు పా రితోషకం అందించారు. నూగూరి మహేందర్, ఉమామహేశ్వర్ తదితరులు ఉన్నారు.
3న బీసీ రాష్ట్ర సదస్సు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 3న హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రా జ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హాజరుకాను న్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా ల నుంచి బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, యువకులు, విద్యావేత్తలు, సామాజీకవేత్తలు, మహిళా నేతలు పెద్దఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.

బోనాల జాతరలో ఎమ్మెల్యే

బోనాల జాతరలో ఎమ్మెల్యే