
ఆరుతడి పంటలే వేసేటోడిని
కాలువ నీళ్లు వస్తే వరి సాగయ్యేది. చివరి ఆయకట్టుకు నీళ్లు రాక అనేక ఏండ్లుగా నాకున్న మూడెకరాల్లో ఆరుతడి పంటలే వేసేటోడిని. ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా కాలువ నీళ్లు రాలేదు. పూడికతీతతోనైనా ఈసారి వరి సాగు చేస్తా.
– ఆర్తం సదానందం, రైతు, ఎగ్లాస్‌పూర్
చివరి ఆయకట్టుకూ సాగునీరు
ఎస్సారెస్పీ డీ– 83 కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాం. ఇరవై ఏళ్లకుపైబడి కాలువలో పూడిక తీత చేపట్టకపోవడంతో పూర్తిగా మట్టితో నిండింది. నీళ్లు పారేవి కావు. ఈసారి పూర్తిస్థాయిలో మట్టి తొలగిస్తున్నాం. చివరను ఉన్న ఖానాపూర్ శివారు భూములకూ కాలువ ద్వారా సాగునీళ్లు అందిస్తాం.
– రమేశ్‌బాబు, డీఈ, ఐబీ, మంథని