ప్రత్యేకం! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేకం!

May 25 2025 10:59 AM | Updated on May 25 2025 10:59 AM

ప్రత్

ప్రత్యేకం!

పాలన..
పనితీరు..
ఉత్తీర్ణత పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ..

ఒక్కో కలెక్టర్‌ది.. ఒక్కో ప్రత్యేకత

పాలనలో తమదైన ముద్ర వేస్తున్న ఐఏఎస్‌లు

ప్రజల్లో మమేకమవుతూ.. ముందుకెళ్తున్న జిల్లా బాస్‌లు

చదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీ సుకెళ్తుందని గుర్తించిన జగిత్యాల కలెక్టర్‌గా స త్యప్రసాద్‌ 2024 జూన్‌ 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాపై తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం హ్యాట్రిక్‌గా నిలిచింది. అనంతరం కరోనాతో అట్టడుగు స్థానానికి వెళ్లింది. రాష్ట్రస్థాయిలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులతో ముఖాముఖీ, ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేయడంతో పాటు, ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాల్గో స్థానంలో జగిత్యాల మళ్లీ నిలిచింది. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 200 మందికి ఉచితంగా కోచింగ్‌ ఇప్పించగా 60 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆరుగురు గ్రూప్‌–1 జాబ్‌లు సాధించారు. అవసరమైన పిల్లలకు ఉచితంగా ల్యాప్‌టాప్స్‌ అందజేశారు. కొండగట్టు జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఎండ, వాన లెక్కచేయకుండా స్వామివారి సన్నిధిలో ఉంటూ రాత్రంతా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్‌ చేస్తూ పాలనలో తనదైన మార్క్‌ చూపెడుతున్నారు.

ప్రత్యేకం!1
1/3

ప్రత్యేకం!

ప్రత్యేకం!2
2/3

ప్రత్యేకం!

ప్రత్యేకం!3
3/3

ప్రత్యేకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement