
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు
కోల్‌సిటీ(రామగుండం): ఉచిత న్యాయ సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జిల్లా అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు సూచించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. వరకట్న దురాచారం రూపుమాపడానికి, భ్రూణ హత్య లు అరికట్టడానికి, అవినీతి నిర్మూలించడానికి ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. క్షణికావేశంలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని అ న్నారు. వాటి నియంత్రణకు ప్రతీఒక్కరు తమ భావోద్వేగాలను, ఆవేశాలను నియంత్రించుకోవాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న కే సులను త్వరగా పరిష్కరించేందుకు తాను లీ వులు ఎక్కువగా వినియోగించడం లేదని తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మున్సిప ల్ కార్మికులు అందించిన సేవలను ప్రశంసించారు. న్యాయవాది జీవన్ గ్లోరీ మాట్లాడారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, న్యాయవాదులు గుడికందుల భూమ య్య, గోలి తిరుపతిరావు, ఆర్‌వో ఆంజనేయు లు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.
పాలిసెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్
ధర్మారం(ధర్మపురి): పాలిసెట్ ఫలితాల్లో నందిమేడా రం గ్రామానికి చెందిన పి. సాత్విక రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. ఓ ప్రైవేట్ హైస్కూల్‌లో టెన్త్ చదివిన సాత్విక టీజీఆర్‌జేసీలోనూ 2వ ర్యాంకు సాధించినట్లు కేవీఆర్ తెలిపారు. సాత్విక ను కరస్పాండెంట్ జైన సురేశ్‌కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి అభినందించారు.

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి