
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, రాఘవపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఏఎంసీలో ఇప్పటివరకు 13,500క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాఘవపూర్‌లో అదనంగా హమాలీలను నియమించి రెండుమూడ్రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, జూన్ 25న చేపట్టే గ్రామపాలన అధికారి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వేణు సూ చించారు. సకాలంలో ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తె లిపారు. ఉదయం 10 గంటలకు గేటు మూసివేశాక అభ్యర్థులను లోనికి అనుమతించవద్దని అన్నారు. ఆర్డీవో గంగయ్య, కలెక్టరేట్ సీ– వి భాగం సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో పేషెంట్ల రద్దీ
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ, మాతా శిశుకేంద్రం ఆస్పత్రుల్లో శనివారం పేషెంట్లు బారులు తీరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చేవారు వెంట తెచ్చుకున్న ఆధార్‌కార్డును చూపి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఇలా బారులు దీరారు. ప్రతీరోజు సుమారు 800మందికిపైగా ఓపీ రిజిస్ట్రేషన్ అవుతోందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు.
ఐటీఐ కోర్సుల్లో ఉచిత శిక్షణ
రామగుండం: పట్టణంలోని ఐటీఐలో ఉచిత షార్ట్‌టర్మ్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేందర్, శిక్షణ అధికారి విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(పీఎంఎస్‌జీఎంబీ) పథకంలో భాగంగా వారంరోజులపా టు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణ విజయ వంతంగా పూర్తిచేశాక పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి స్కిల్ డెవలప్‌మెంట్ ధ్రువీకరణపత్రం అందజేయనున్నామని వారు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రెండురోజుల్లోగా తమ వివరాలను నేరుగా ఐటీఐకి వచ్చి నమోదు చేసుకోవాలని వారు సూచించారు.
కొత్త పద్ధతులు అవలంబించాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించేలా కొత్త పద్ధతులు పాటించాలని ఏడీఏ శ్రీనాథ్, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీధర్ రైతులకు సూచించారు. తారుపల్లి గ్రామంలో శనివారం రైతు ముంగిట వ్యవసాయ శాస్త్ర వేత్తలు కార్యాక్రమం నిర్వహహించారు. విత్తన ఎంపిక, కొనుగోలు, శుద్ధి, శాసీ్త్రయ సాగు పద్ధతులు, ఎరువులు, సాగునీటి యాజమాన్యం, నేల, మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం, సస్యరక్షణ పద్ధతులు, హైబ్రిడ్ విత్తనాల సాగు, పత్తి, వరి, మిరప, అపరాల సాగు. అంతరపంటల సాగు ఏ కార్తెలో ఏ పంటలు వేయాలనే అంశాలపై వారు సమగ్రంగా వివరించారు. ఏవో నాగార్జున, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ఏఈవో స్పందన, రైతులు తదితరులు పాల్గొన్నారు.
30లోగా ఆస్తిపన్ను చెల్లించండి
కోల్‌సిటీ(రామగుండం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఆస్తిపన్నుపై అపరాధ రుసుం వసూలు చేయడం లేదని, ఈ అవకాశం జూన్ 30 వరకే ఉందని రామగుండం బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. ఈమేరకు ఇంటింటికీ ఆస్తిపన్నుల డిమాండ్ నోటీసులు జారీచేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ మరో మూడురోజుల్లో పూర్తిచేస్తా మని పేర్కొన్నారు. డిమాండ్ నోటీస్ రాకున్నా.. ఆన్‌లైన్‌లో లేదా నగరపాలక సంస్థ కా ర్యాలయం, మీ సేవా కేంద్రాలు, ఇంటివద్దకు వచ్చే వార్డు అధికారులకు ఆస్తిపన్ను చెల్లించాలని ఆమె సూచించారు. గడువు ముగిశాక రెండుశాతం పెనాల్టీ విధిస్తామన్నారు. నగరంపరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు 51,014 ఉండగా 15,176 ఆస్తుల ఆస్తిపన్ను ఇప్పటివరకు చెల్లించారని తెలిపారు. మిగిలినవారు వెంటనే ఆస్తిపన్ను చెల్లించి నగరాభిద్ధివృకి సహకరించాలని కమిషనర్ కోరారు.

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

సజావుగా ధాన్యం కొనుగోళ్లు