
‘నకిలీ’ గండం గట్టెక్కేనా?
సాక్షి, పెద్దపల్లి: ఈనెల 25 న(ఆదివారం) రోహిణి కా ర్తె ప్రవేశిస్తుండడంతో వా నాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. ఇదే అదను గా విత్తన మాయగాళ్లు పల్లె బాటపట్టి అన్నదాతలను బురడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా నకిలీ, అ నుమతి లేనివిత్తనాల విక్రయం పరిపాటిగా మారింది. కొన్ని కంపెనీలు తమ విత్తనాలకు బాగా డి మాండ్ ఉండాలనే లాభాపేక్షతో క్షేత్రస్థాయి ప్రదర్శ న ఏర్పాటు చేసి రైతులను పిలిచి బిర్యాణిలు పెట్టి బాగా పండిన పత్తి పంటను చూపించి తమ విత్తనంతోనే ఇంతలా దిగుబడి వచ్చిందనే భ్రమలు కల్పిస్తున్నాయి. దీంతో రైతులు ఆ విత్తనమే కావాలంటూ డీలర్లను కోరడంతో దళారులు అధిక ధరలకు విక్రయించడం, ఏదా కల్తీవి అంటగట్టడం సా ధారణంగా మారుతోంది. ఉన్న వాటిని బ్లాక్ మా ర్కెట్‌కు తరలించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
మోసాలను అరికట్టేందుకు..
విత్తనాల విషయంలో దళారుల మోసాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్య వసాయశాఖతోపాటు పోలీసు అధికారులతో టా స్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ, నకిలీ విత్తనా ల సరఫరా, విక్రయాలను ఆశించిన స్థాయిలో టాస్క్‌ఫోర్స్ తగిన చర్యలు తీసుకోవడం లేదనే వి మర్శలున్నాయి. నకిలీ విత్తనాలు మార్కెట్‌లో ప్రవేశించి.. రైతులకు విక్రయించాక గానీ దాడులు చేయడంలేదు. వానకాలంలో విత్తనాలు విక్రయిస్తారని తెలిసినా.. ముందస్తు సమాచారంంతో దాడులు చేస్తే నకిలీ విత్తనాలను నిల్వచేసిన గోదాములను గుర్తించే వీలుంది. ప్యాకింగ్, విత్తన సేకరణ వంటి వాటిపైనా దృష్టి సారిస్తే నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి విడుదలకు, విక్రయాలకు ముందే అరికట్టే ఆస్కారముందని అన్నదాతలు చెబుతున్నారు.
కమీషన్‌లకు ఆశపడి
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2,76, 076 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు పండిస్తార ని అఽధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వీటిలో 2,12,500 ఎకరాల్లో వరి, 52,500 ఎకరాల్లో పత్తి సాగుచేయనున్నారు. ఇందుకోసం 1,84,487 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. జిల్లాలో సుమారు 540 ఫెర్టిలైజర్ షాపులుండగా, అందులోని కొందరు వ్యాపారులు కమీషన్‌కు ఆశపడి దళారులతో చేతులు కలుపుతున్నారు. కొత్త వంగడమని చెబుతూ నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను జిల్లాకు దిగుమతి చేసి రైతులకు అంటగడుతున్నారు. ప్రతీ వానాకాలం మాదిరిగానే ఈ సీజన్‌లోనూ లూస్ పత్తి సీడ్స్ విక్రయిస్తున్న తెలుస్తోంది. కొన్ని రకాల విత్తనాలు ఆకర్షణీయమైన రంగుల ప్యాకెట్లలో ప్యాక్‌చేసి విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా ఫిర్యాదు చేయండి..
దళారుల గురించి ఎవరికి, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకునేందుకు రైతులు ముందుకు రావాలి. అండగా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉన్నాయి. నకిలీ విత్తనాల విషయం తెలిసిన వెంటనే టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఫోన్‌చేసి సమాచారం అందించాలి. మిగతా విషయాలు వారు చూసుకుంటారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు విక్రయించడం వంటివి చోటుచేసుకుంటే రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
● గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తామని ఎవరైనా చెబితే నమ్మకూడదు. లూస్ విత్తనాలు కొనుగోలు చేయొద్దు
● అనుమతి పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి
● విధిగా రసీదు తీసుకోలి. విత్తనసంచుల లాట్ నంబరు సరిచూసుకోవాలి
● సంచులపై క్యూఆర్‌కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి పూర్తివివరాలు తెలుసుకోవచ్చు.
● పంటకాలం పూర్తయ్యే వరకూ బిల్లులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి
● నకిలీవని తేలితే కొనుగోలు చేసిన బిల్లులను వ్యవసాయశాఖ అధికారులకు చూపి సంబంధిత వ్యాపారి ద్వారా పరిహారం పొందవచ్చు.
తనిఖీలు చేస్తున్నాం
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. జిల్లా, మండలస్థాయిల్లో దుకాణాలు, గోదాములను తనిఖీ చేస్తున్నాం. వ్యాపారులు నకిలీ, బీటీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవు. రైతులు కూడా విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్రతీకొనుగోలుకు బిల్లులో విత్తనం బ్యాచ్ నంబర్, కంపెనీ పేరు, తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు, డీలర్ సంతకం ఉండేలా చూసుకోవాలి. – ఆదిరెడ్డి, డీఏవో
ఏటా అన్నదాతకు తప్పని తిప్పలు
నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్‌ఫోర్స్
అధికారుల ముందస్తు తనిఖీలు
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట

‘నకిలీ’ గండం గట్టెక్కేనా?