
సౌరశక్తి.. అనాసక్తి
సాక్షి, పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఉమ్మడి జిల్లాలో స్పందన అంతంత మాత్రమే ఉంది. సౌరశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని ప్రభుత్వం ప్రో త్సహించి, గృహాలు, ఆఫీస్‌లు, ఇతరత్రా సంస్థలు, అర్హులందరికీ రాయితీ కల్పిస్తున్నారు. అయినా ఆ యా వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రా వడం లేదు. దీనిపై సంబంధిత సంస్థల నుంచి కొరవడిన ప్రచారంతో ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. అణు, థర్మల్ విద్యుదుత్పత్తితో పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. దీనిని నియంత్రించడంతోపాటు భవిష్యత్ డిమాండ్ నేపథ్యంలో సౌర విద్యుత్‌కు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. గృహ వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్‌ను వారి ఇంటిపై సౌర ఫలకలు(సోలార్ ప్యానళ్లు) ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటే దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం కానరావడం లేదు.
465 దరఖాస్తులకు..
ఉమ్మడి జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి 589.4 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 465 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 131మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 109 మంది 134.7 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇళ్లపై ఏర్పాటు చేశారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాక ‘రోజుకు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది?, ఎంత వినియోగం ఉంటుంది?, గ్రిడ్‌కు ఎంత వెళుతుంది?’ అనే సమాచారాన్ని ‘నెట్‌మీటర్’ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మరమ్మతులు వస్తే కంపె నీ ప్రతినిధులు వచ్చి చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్‌కో వీటిని ఏర్పాటు చేస్తుంది.
రూ.కోటి నజరానా
పీఎం సూర్యఘర్, ముఫ్త్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాయితీ ద్వారా సోలార్ ప్యానెళ్లను అమర్చుకునేలా ఆయా గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో 5వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఎక్కువ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా పోటీని ప్రారంభించి ఆరునెలలపాటు కొనసాగిస్తోంది. అత్యధికంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే గ్రామాన్ని జిల్లాస్థాయి కమిటీ ‘మోడల్ సోలార్ విలేజ్‌గా’ గుర్తించి రూ.కో టి ప్రోత్సాహం అందిస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లిలో 21, జగిత్యాలలో 23 గ్రామాను ఎంపిక చేయగా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో సౌరశక్తి యూనిట్ల దరఖాస్తులు
జిల్లా దరఖాస్తులు ఈఎండీ కెపాసిటీ (మెగావాట్లలో)
జగిత్యాల 117 31 33.7
కరీంనగర్ 178 56 52.2
పెద్దపల్లి 90 13 16.8
సిరిసిల్ల 80 31 32
మొత్తం 465 131 134.7
సూర్యఘర్ పథకంపై జిల్లావాసుల్లో నిరాసక్తత
రాయితీ వర్తిస్తున్నా పట్టించుకోని వైనం
ఉమ్మడి జిల్లాలో 465 దరఖాస్తులకు డబ్బు చెల్లించింది 131 మందే
అపోహలు వద్దు
సోలార్ పవర్‌తో విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. తొలుత పెట్టుబడి ఎక్కువగా అనిపించినా.. భవిష్యత్‌లో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్‌టాప్ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదు. – అజేయ్, డీఎం, రెడ్కో

సౌరశక్తి.. అనాసక్తి