క్వార్టర్ల కేటాయింపుపై సింగరేణి విజి‘లెన్స్‌’ | - | Sakshi
Sakshi News home page

క్వార్టర్ల కేటాయింపుపై సింగరేణి విజి‘లెన్స్‌’

May 25 2025 12:05 AM | Updated on May 25 2025 12:05 AM

క్వార్టర్ల కేటాయింపుపై సింగరేణి విజి‘లెన్స్‌’

క్వార్టర్ల కేటాయింపుపై సింగరేణి విజి‘లెన్స్‌’

ఆర్జీ–1 ఏరియాలో కూపీలాగుతున్న అధికారులు

పైరవీలతోనే అలాట్‌ చేశారని ఆరోపణలు

గోదావరిఖని: సింగరేణిలో సీనియర్లకు కాకుండా అనర్హులకు క్వార్టర్లు కేటాయించారనే ఫిర్యాదులపై విజి‘లెన్స్‌’ ఆరా తీస్తోంది. అర్హులైన కార్మికులకు క్వార్టర్లు దక్కకుండా పైరవీకారుల సూచనలతో అనర్హులకు కేటాయించారనే ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సింగరేణి విజిలెన్స్‌ అధికారులు.. విచారణ వేగవంతం చేశారు. ఇటీవల ఎన్నిక్వార్టర్లు కేటాయించారు? ఎంత మందికి కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయించారు? ఎన్నిక్వార్టర్లు పైరవీలతో కేటాయించారు? అనే అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈమేరకు శుక్రవారం ఏరియా క్వార్టర్ల కేటాయింపు ముఖ్య అధికారి చాంబర్‌లో విజిలెన్స్‌ అధికారులు సుమారు గంటపాటు కూపీలాగినట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల పైరవీ లెటర్లతోపాటు స్థానిక కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు ఏరియాలో భారీగా క్వార్టర్లు కేటాయిచారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందడంతో రహస్యంగా విచారణ చేపట్టినట్లు చర్చ జరుగుతోంది. అయితే అధికారి పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగి తాము ఇబ్బంది పడుతున్నామని అధికారులు వాపోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు నేరుగా ఎన్ని క్వార్టర్లు కేటాయించారు? దానికి పైరవీ లెటర్లు, పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం క్వార్టర్ల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

సీనియర్లకు మొండిచేయి..

సింగరేణిలో సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్లు కేటాయిస్తున్నారు. ప్రతీనెల లేకుంటే మూడు నెలలకోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించి క్వార్టర్లు కేటాయిస్తున్నా రు. అయితే సీనియర్‌ కార్మికులు తమకు నచ్చిన క్వార్టర్‌ ఎంపిక చేసుకుంటే ఆ క్వార్టర్‌ కౌన్సెలింగ్‌కు రాకుండానే కేటాయిస్తున్నారని అంటున్నారు. చాలా క్వార్లర్లు ఇలాగూ కేటాయిస్తుండడంతో కార్మికులు అసంతృప్తికి లోనవుతున్నారు. విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఉగ్రవాదాన్ని అంతమొందించాలి

కరీంనగర్‌: దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించి, మతసామరస్యాన్ని కాపాడాలని, ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక సుగుణాకర్‌రావు భవన్‌లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వారోత్సలు నిర్వహించార. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, అనంతర పరిణామాలు అంశంపై సీపీఎం జి ల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అధ్యక్షతన సెమినార్‌ జరిగింది. వీరయ్య మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే, ఒక మతానికి వ్యతిరేకంగా మోదీ పరివారం సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిందని, ఇది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. కశ్మీర్‌ ముస్లింలే పర్యాటకులను కా పాడారని, రైల్వే, ఎయిర్‌పోర్టులకు ఉచితంగా పర్యాటకులను చేరవేశారన్నా రు. అదే కార్పొరేట్‌ శక్తులు ఎయిర్‌లైన్స్‌లో రూ.6 వేలు ఉన్న టిక్కెట్‌కు రూ.60 వేలకు పెంచారన్నారు. ఈ ఉగ్రదాడిలో ఒకముస్లిం హార్స్‌ రైడర్‌ చనిపోయారన్నారు. తామంతా ఒకటిగా ఉన్నామని అక్కడి ముస్లింలు నినదించిన విషయా న్ని మర్చిపోకూడదన్నారు. యుద్ధంతో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఉదంతాలు ప్రపంచంలోనే లేవన్నారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్‌ వైఖరిపై మోదీ నోరు మెదపలేదన్నారు. ఉగ్రవాదుల అంతు తేల్చామని ఒకవైపు ప్రధాని చెబుతున్నారని, నేటికీ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదన్నారు. కాల్పుల విరమణ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని, ఉగ్రదాడి అనంతర పరిణామాలపై పార్లమెంట్లో ఎందుకు చర్చించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement