
అంజన్న ఆదాయ రూ.1.51కోట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 20 నుంచి 22వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉ త్సవాలు అన్ని శాఖల సమన్వయం, సహకారంతో విజయవంతమయ్యాయని ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించామని పేర్కొన్నారు. స్వామివారికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.79,14,200, పులిహోర ద్వారా రూ.10,45,920, దీక్ష విరమణల ద్వారా రూ.30,56,100, కేశ ఖండనం ద్వారా రూ.8,51,450, శీఘ్ర దర్శనం ద్వారా రూ.23,04,800 మొత్తం రూ.1,51,72,470 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటు
జగిత్యాలరూరల్: సౌదీ అరేబి యాలో తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మల్లేశ్ ఆధ్వర్యంలో సాటా రియాద్ చాప్టర్ కోర్ టీంను శనివారం ప్రకటించా రు. అధ్యక్షుడిగా మచ్చ శ్రీనివా స్, వైస్ ప్రెసిడెంట్‌గా నూర్ మ హమ్మద్, ఇంజినీరింగ్ ప్రెసిడెంట్‌గా సింగు నరేష్ కుమార్, బిజినెస్ ప్రెసిడెంట్‌గా వీరవెల్లి యోగేశ్వరారావు, టీచర్స్ ప్రెసిడెంట్‌గా మురళిని ఎన్నుకున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కులం, మతం బేధం లేకుండా అందరం కలిసి కష్టాల్లో ఉన్నా తెలుగువారికి అన్ని విధాలా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. కొత్తగా ఎన్నికై న కోర్ టీమ్ శహబాజ్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, నయీమ్, అయాజ్, ముజామిలోద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష మహేశ్‌కు అభినందనలు తెలిపారు. మల్లేశ్ మాట్లాడుతూ.. నాయకత్వం, అంకితభావంతో పనిచేస్తామని వెల్లడించారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
● సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి
గోదావరిఖని: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గదర్శి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ నేతలను ఎన్‌కౌంటర్ పేరిట చంపుతూ పైచాచిక ఆనందం పొందుతోందన్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని ఆ యుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా.. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందని ధ్వజమె త్తారు. సీపీఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్‌లో చండీగఢ్‌లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు లో మేడ్చల్ జిల్లాలో జరుగన్నాయని తెలిపారు. ఈలోగా పట్టణ, మండల, జిల్లా మహాసభలు పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు శంకరన్న, తాండ్ర సదానందం, గోసిక మోహన్, గోవర్ధన్, కె.కనకరాజ్, తాళ్లపెల్లి మల్లయ్య, కొడం స్వామి తదితరులు పాల్గొన్నారు.

అంజన్న ఆదాయ రూ.1.51కోట్లు