
సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించండి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని గురువారం హైదరాబాద్‌లో సంస్థ సీఎండీ ఎన్.బలరాంకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి, రామగుండం రీజియన్‌లోని కార్మిక కుటుంబాలకు ఏరియా ఆస్పత్రి కీలకంగా మారిందన్నారు. ఈనేపథ్యంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. శాశ్వత ప్రతిపాదికన న్యూరో ఫిజిషియన్, పిడియాట్రిషియన్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్, ఆప్తామాలజిస్ట్, అదనపు ఫిజీషియన్‌ను నియమించాలన్నారు. అలాగే టూడీ ఈకో, టీఎంటీ టెక్నీషియన్, ఆపరేటర్ నియమించాలని, డయాలసిస్ యూనిట్ విస్తరించాలని కోరారు. ఇందుకు సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.