
పింఛన్ పెరిగే వరకూ పోరు
గోదావరిఖనిటౌన్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ పెరిగే వరకూ పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. నగరంలో బుధవా రం ఆయన పర్యటించారు. తొలుత స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ జంక్షన్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని కేంద్రమంత్రిని డిమాండ్ చేయగా ఆయన స్పందించారని తెలిపా రు. ఎన్టీపీసీ నిర్వాసితులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యా దు చేశానని అన్నారు. దళితుల అభ్యున్నతికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎంపీ పేర్కొన్నారు.
నీటి నిల్వకు స్థలాల గుర్తింపు
గోదావరిఖని: సింగరేణి సీఎండీ ఆదేశాల మేరకు ఆ ర్జీ–1 ఏరియాలో నీటి నిల్వల కోసం పలు ప్రాంతాలను అధికారులు బుధవారం గుర్తించారు. ‘సింగరేణి నీటిబిందువు – జల సింధువు’లో భాగంగా మూతపడిన మేడిపల్లి ఓసీపీ పరిసరాల్లోని 6.26 హెక్టార్ల విస్తీర్ణంలో 7 ట్యాంక్‌లను నిర్మించేందుకు స్థలాలను గుర్తించారు. ఎస్‌వోటూ జీఎం గోపాల్‌సింగ్, ఎన్విరాన్‌మెంట్ అధికారి ఆంజనేయప్రసా ద్, సివిల్ ఎస్‌ఈ వరప్రసాద్, సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, మేనేజర్ మల్లికార్జున్‌యాదవ్ ఉన్నారు.

పింఛన్ పెరిగే వరకూ పోరు