
వచ్చే ఎన్నికల్లో విజయం మాదే
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
పెద్దపల్లిరూరల్: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. తె లంగాణలోనూ ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ జిల్లా కమిటీ ఖరారు..
బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రే ణులను సమాయత్తం చేస్తున్నామని సంజీవరెడ్డి అన్నారు. పార్టీ పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఖరా రు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్, కాసగోని ని ర్మల(పెద్దపల్లి), ముస్కుల భాస్కర్‌రెడ్డి(రామగుండం), మత్స్యగిరి రాము(మంథని)ను నియమించామన్నారు. ప్రధానకార్యదర్శులుగా కడారి అశోక్‌రావు, పల్లె సదానందం(పెద్దపల్లి), కోమళ్ల మహేశ్(రామగుండం), కార్యదర్శులుగా జంగ చక్రధర్‌రెడ్డి, మౌఠం నర్సింగం, మహేందర్, కంకణాల జ్యోతిబసు, బిరుదు గట్టయ్య, అధికార ప్రతినిధులుగా శనిగరపు రమేశ్, పిలుమర్రి సంపత్, జక్కుల నరహరిని నియమించామన్నారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా పిన్నింటి విశా ల్, కిసాన్‌మోర్చా అధ్యక్షుడిగా గూడెపు జనార్దన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చాతరాజు రమేశ్, దళిత మోర్చా అధ్యక్షుడిగా మచ్చవిశ్వాస్‌తోపాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను నియమించామని ఆయన వివరించారు.

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే