
సామర్థ్యానికి మించి..
మంథని: అసలే ప్రైవేట్ వాహనాలు.. ఆపై అస్తవ్యస్తమైన రహదారులు.. అనేక మూలమలుపులు.. నిబంధనలు సరిగా అమలుకు నోచుకోవు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నాయి.. అనూహ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పలు రోడ్డు ప్రమాదాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఆటోలు, టాటా ఏస్ వాహనదారులు ప్రయాణికుల తరలింపులో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లాలో ని పెద్దకల్వల వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. శనివారం మంథని మండలం నాగెపల్లి వద్ద వ్యవసాయ కూలీలను తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 16 మంది మహిళా కూలీలు గాయపడ్డారు.
సౌకర్యం లేక.. తప్పనిసరై..
ప్రతీవ్యవసాయ సీజన్‌లో కూలీ పనుల కోసం పొరుగు జిల్లాలకు వెళ్లే వారు అనేకమంది ఉంటారు. అంతేగాకుండా స్థానికంగా పని లభించని పరిస్థితుల్లో మరికొందరు కూలీలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలివెళ్తున్నారు. ఇంకా కొందరు కొరత ఉన్న ప్రాంతాలకు వెళ్లడం సహజం.
మిర్చి ఏరేందుకు వెళ్తూ..
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం, గాదంపల్లి, పెద్దతూండ్ల తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున మిర్చి సాగవుతోంది. అక్కడ కూలీల కొరత ఉంది. దీంతో సమీప గ్రామాల నుంచి కూలీలు.. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో అక్కడకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. టాటా ఏస్ లాంటి వాహనంలో 10 నుంచి 12 మందిని తరలించాల్సి ఉండగా 20 మందిని తరలిస్తున్నారు. అలాగే ఐదు, ఆరు సీట్ల సామర్థ్యం గల ఒక్కో ఆటోలో 15 మందిని తరలిస్తున్నారు. మిర్చి ఏరే ప్రాంతాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యం ఏమీలేదు. కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ, ఇతర వాహనాల సౌకర్యం ఉన్నా.. సమయానికి అందుబాటులో ఉండవు. తప్పనిసరి పరిస్థితిల్లో.. అదికూడా ప్రమాదకరమని తెలిసినా.. వ్యవసాయ కూలీలు ఆటోలు, టాటా ఏస్‌లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కండిషన్ లేదు.. పర్యవేక్షణ లోపం
నిత్యం ప్రయాణికులను చేరవేసే ప్రైవేట్ వాహనా ల కండిషన్‌ను పర్యవేక్షించాల్సిన అధికారులు ప ట్టించుకోవడంలేదు. పరిమితికి మించి ప్రయాణికు లు, విద్యార్థులను తరలిస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నా రు. ఫిట్నెస్ లేకున్నా, మరమ్మతుల్లోని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా తనిఖీలు చేయరు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనదారులు
ఆటోలు, టాటా ఏస్‌లలో పరిమితికి మించి ప్రయాణం
తరచూ ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోతున్నా పట్టని యంత్రాంగం
బోల్తాపడిన ఆటో
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని పిల్లిపల్లె గ్రామంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడిపోయింది. జూలపల్లి గ్రామానికి చెందిన అరుణ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో పిల్లిపల్లె గ్రామంలో రేణుక ఎలమ్మ ఆలయానికి బయలు దేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆటో పిల్లిపల్లెలోని మూలమలుపు వద్దకు చేరగా.. కుక్క అడ్డురావడంతో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన కందకంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సామర్థ్యానికి మించి..