కోల్‌సిటీ(రామగుండం): కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యా న్ని మెరుగుపర్చడం కోసం ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి రెడ్యూస్–రియూజ్–రీసైకిల్(ఆర్‌ఆర్‌ఆర్) పేరిట ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2024’ పోటీలు చేపట్టారు. ఇందులోనూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిలిచింది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌కు కీలకమైన ప్రజప్రాయా(సిటిజన్ ఫీడ్‌బ్యాక్) సేకరణ చేపట్టిది. మరో కీలకమైన బ హిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్) పరిస్థితిని తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు శుక్రవారం రామగుండం చేరుకున్నార. శనివారం నుంచి బల్దియాలో ఓడీఎఫ్ స్థితిని నేరుగా తనిఖీ చేస్తారు.
ఓడీఎఫ్ – ప్లస్ ప్లస్ కోసం ఆశలు..
రామగుండం బల్దియాకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్(బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. 2023లో ఆ గుర్తింపు వచ్చింది. ఓడీఎఫ్–ప్లస్‌ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల దరఖాస్తు చేసింది. అయితే, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. మల్కాపూర్‌లో వినియోగంలోకి వచ్చిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఎఫ్‌ఎస్టీపీ) ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఓడీఎఫ్‌కు 1,200 మార్కులు..
ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీలో మొత్తం 12,500 మార్కులు కేటాయించారు. ఇందులో ఓడీఎఫ్‌కు 1,200, గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగానికి 1,300, ఇతర విభాగాలకు 10,000 మార్కులు కేటాయించారు. క్యూసీఐ ప్రతినిధులు ఇచ్చే మార్కుల ఆధారంగా ఓడీఎఫ్‌పై రేటింగ్ రానుంది. జాతీయ స్థాయిలో ప్రకటించే ర్యాంక్‌క్‌లకూ ఓడీఎఫ్ మార్కులు కీలకం కానున్నాయి.
నేటి నుంచి క్యూసీఐ బృందం పరిశీలన..
ఢిల్లీ నుంచి వచ్చిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ)లో రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ ఉన్నారు. తొలిరోజున బల్దియా కార్యాయంలో ఓడీఎఫ్ డాక్యుమెంట్లు పరిశీలించారు. శనివారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీంతో పారిశుధ్య విభాగం అప్రమత్తమైంది.
బల్దియాలో 25 టాయిలెట్స్ పరిశీలన..
బల్దియాలో ఆరు పబ్లిక్, 19 కమ్యూనిటీ టాయిలెట్స్‌తోపాటు ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్ వినియోగంలో ఉ న్నాయనిఅధికారులుస్వచ్ఛ సర్వేక్షణ్ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వీటి ఆధారంగా క్యూసీఐ వాటిని క్షేత్రస్థాయిలోపరిశీలించి వివరాలు సేకరించనుంది.
క్యూసీఐ పరిశీలించే అంశాలు..
సెఫ్టిక్ ట్యాంక్‌ల నిర్వహణ, పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్‌లో అందుబాటులో కేర్ టేకర్, రోస్టర్ పద్ధతిలో క్లీనింగ్, టాయిలెట్స్‌కు వచ్చే ప్రజల ఫీడ్‌బ్యాక్, మహిళలు, పురుషులు గుర్తించేలా టాయిలెట్స్ బోర్డులున్నాయా? లోపల లైటింగ్, వా ష్‌బేసిన్, మిర్రర్, విడిగా యూరినల్స్, బాత్‌రూం తలుపులకు లోపలైపు బోల్టులు, వాటర్ సరఫరా, దుర్వాసన రాకుండా ఒడోనిల్, వెంటిలేషన్, ఎగ్జాస్టింగ్, క్యూఆర్ కోడ్ తదితర సౌకర్యాలపై క్యూసీఐ తనిఖీ చేసి ఫొటోలు తీసుకోనుంది. అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయనుంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌లు
తలుపులు బిగించారా.. దుర్వాసన వస్తుందా?
నేటి నుంచి క్యూసీఐ బృందం క్షేత్రస్థాయి తనిఖీలు
రామగుండం బల్దియాకు చేరుకున్న ఢిల్లీ ప్రతినిధులు
సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్ల నిర్వహణపై ఆరాకు సన్నద్ధం
పారిశుధ్య విభాగం ప్రొఫైల్:
మొత్తం డివిజన్లు 50
విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 93.87
జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644
గుర్తించిన మురికివాడలు 92
స్వచ్ఛ సర్వేక్షణ్–2024 మార్కులు
కేటాయించినవి 12,500
గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగం 1,300
ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్, వాటర్ ప్లస్ 1,200
ఇతర విభాగాలు 10,000
పోటీ పడుతున్న
బల్దియాలు
సంవత్సరం
రామగుండం ర్యాంక్
2017 434 191
2018 4203 194
2019 4237 192
2020 4242 211
2021 4320 92
2022 4354 136
2023 4416 175
2024 4900 (ప్రస్తుతం ర్యాంక్ సర్వే)