‘చెత్త’కు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘చెత్త’కు పరిష్కారం

Mar 18 2025 12:19 AM | Updated on Mar 18 2025 12:18 AM

● స్థానికుల వ్యతిరేకతతో ఓసీపీ–4 ప్రాంతంపై యూటర్న్‌ ● గతంలో చెత్త వాహనాలను అడ్డుకున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ● తాజాగా అదే స్థలాన్నే చెత్త నిల్వలకు వినియోగిస్తున్న వైనం ● ఊపిరి పీల్చుకుంటున్న రామగుండం నగర పాలక సంస్థ అధికారులు

కోల్‌సిటీ(రామగుండం): చెత్త సేకరణలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన రామగుండం మున్సిపల్‌ కా ర్పొరేషన్‌కు శాశ్వత డంపింగ్‌ యార్డు లేక ఇన్నాళ్లూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు గోదావరి తీరంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఖాళీ స్థలం వినియోగానికి అడ్డంకులు తొలిగినట్లు సమాచారం. ఊపిరి పీల్చుకున్న బల్దియా అధికారులు.. ఇంటింటా సేకరించిన చెత్తను యార్డుకు తరలిస్తున్నారు.

బమోమైనింగ్‌ ఏర్పాటు కూడా..

యార్డులో బయో మైనింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చే యడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ చేపడతారు. సేంద్రియ ఎరువూ తయారు చేస్తారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదేస్థలంలో గతంలో చెత్త పోయడానికి వెళ్లే వాహనాలను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మూసివేసిన సింగరేణి ఓసీపీ–4 స్థ లాన్ని రెండు నెలల క్రితం చదును చేశారు. స్థానికు ల నుంచి తీవ్ర వ్యతిరేకంత ఎదురైంది. తాజాగా క లెక్టర్‌ ఆదేశాలతో బల్దియా అధికారులు ఇక్కడే తాత్కాలిక డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తున్నారు.

అనేక అవాంతరాలు..

బల్దియాకు సుమారు ఇరవై ఏళ్లుగా శాశ్వతపు డంపింగ్‌ యార్డుకు స్థలం లభించడంలేదు. 15ఏళ్ల క్రి తం రామగుండంలో ఏర్పాటు చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జల్లారం శివారులో పదెకరాలను కేటాయించిన సింగరేణి.. ఓసీపీ–5 ఏర్పా టు కావడంతో మళ్లీ స్వాధీనం చేసుకుంది. పీకే రా మయ్యకాలనీ సమీపంలోని రామునిగుండాలగుట్ట సమీప క్వారీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సూచించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీపురం గ్రామ సమీప ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఖాళీస్థలంలో చెత్త డంప్‌ చేయగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గోదావరి ఒడ్డున సమ్మక్క–సారలమ్మ జాతర, హిందూ శ్మశానవాటిక దారిలో రోడ్డు పక్కన చెత్త పారబోయగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సుందిళ్లగ్రామ శివారులోని సింగరేణి స్థలాన్ని వినియోగించినా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా కొంతకాలంగా గోదావరి నదీతీరంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఖాళీ స్థలాన్ని డంపింగ్‌ యార్డుకు వినియోగిస్తున్నారు.

రోజూ 118 మెట్రిక్‌ టన్నుల చెత్త..

నగరంలోని 50 డివిజన్ల నుంచి రోజూ సుమారు 118 మెట్రిక్‌ టన్నుల వరకు చెత్త వెలువడుతోంది. దీంతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో పరిశ్రమలకు చెందిన కాలనీల నుంచి మరో 50 మెట్రిక్‌ టన్నుల వరకు వెలువడుతోంది. ఈ మొత్తం చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించాల్సి ఉంది. ఇప్పటిదాకా డంపింగ్‌యార్డ్‌ అందుబాటులో లేక ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పారబోశారు.

బల్దియా సమాచారం

డివిజన్లు 50

నగర వైశాల్యం(చ.కి.మీ.లలో) 93.87

జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644

మొత్తం నివాసాలు 64,000

రోజూ వెలువడే చెత్త(మెట్రిక్‌ టన్నుల్లో) 118

పారిశుధ్య కార్మికుల సంఖ్య 448

ర్యాగ్‌ పిక్కర్లు 100

స్వచ్ఛ ఆటోలు 53

ట్రాక్టర్లు 18

జేసీబీలు 03

బ్లేడ్‌ ట్రాక్టర్లు 05

చర్యలు వేగవంతం చేస్తేనే..

రాష్ట్రంలోని డంపింగ్‌ యార్డుల్లో సుమారు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త నిల్వలు ఉన్నట్లుగా అధికారులు రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. దీంతో పురపాలక, నగరపాలక సంస్థల్లో వెంటనే బయోమైనింగ్‌ విధానాన్ని అమలు చేయా లని సూచించారు. తొలత చెత్తను శుద్ధిచేసి తడిచెత్తను సేంద్రియ ఎరువు తయారీకి, పొడి చెత్తను సిమెంటు, ఇతర కర్మాగారాల అవసరాలకు తరలించాలని ఆదేశించారు.

‘చెత్త’కు పరిష్కారం1
1/1

‘చెత్త’కు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement