మల్కాపూర్ రోడ్డు, కల్వర్టు మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసకెళ్తాం. ప్రమాదాలు జరగకుండా అఽధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. ఎన్టీపీసీ వరద, సింగరేణి రోడ్డు కావడంతో ఆయా పరిశ్రమల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.
– అరుణశ్రీ, బల్దియా కమిషనర్, రామగుండం
బ్రిడ్జి, రోడ్డు నిర్మించండి
మల్కాపూర్ నుంచి ఓపెన్‌కాస్టు వైపు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్టు ఉన్నప్పుడు రోడ్డు బాగుండేది. ఎన్టీపీసీ వరదకాలువలో నీరు పారడంతోపాటు గతంలో గోదావరి నది బ్యాక్ వాటర్‌తో బ్రిడ్జి కూలింది. బ్రిడ్జి మళ్లీ నిర్మించలేదు. రైతులు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. పాలకులు స్పందించాలి.
– మడ్డి విజయ్‌కుమార్, మల్కాపూర్
పాలకులదే నిర్లక్ష్యం
గత పాలకుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి కూలిపోయింది. మళ్లీ నిర్మించకపోవడం, బ్యాక్ వాటర్‌ను కంట్రోల్ చేయకపోవడం, గోదావరి నది వరదకు కరకట్ట కట్టకపోవడంతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి సింగరేణి, ఎన్టీపీసీల సీఎస్సార్ నిధులతో రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలి. సమస్య పరిష్కరించాలి.
– మొహమ్మద్ రహీమ్, మల్కాపూర్
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం