
దివ్యాంగులకు యూడీఐడీ నంబర్లు
పెద్దపల్లిరూరల్: ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబరు కేటాయించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం యూనిక్ డిసిబిలిటీ ఐడీ జారీ, స్కూల్ యూనిఫాంపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆయన సమీక్షించారు. యూడీఐడీ నంబర్ల కోసం సదరం శిబిరాలకు పరిమితమైన స్లాట్‌లతో ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మీసేవ ద్వారా దర ఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కుబదులు యూనిక్ డిసిబులిటీ ఐడీ కార్డులు అంది స్తారని అన్నారు. వీటిపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సంక్షేమశాఖ అఽధికారిని ఆదేశించారు. యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాల స భ్యుల్లో టైలర్లుగా ఉన్న వారికే అప్పగించాలన్నారు. డీఆర్డీవో కాళిందిని, సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారి వేణుగోపాల్, సూపరింటెండెంట్ శ్రీధర్, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు వసూలుకు
ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎల్‌ఆర్‌ఎస్ రుసుం వ సూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమ లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించేవారికి 25శాతం రాయితీ వర్తిస్తుందనే సమాచారంపై సమగ్ర అవగాహన కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రి, జెడ్పీ హైస్కూల్, ఎంపీడీవో ఆఫీసు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలో 1,036 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆమోదించామని, ఈనెలాఖరులోగా వారందరూ రుసుం చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని అదనపు గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, ఎంఈవో రాజయ్య, హెడ్మాస్టర్ శారద, ఆర్‌ఎంవో మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు