
కాంట్రాక్టు పద్ధతితో సీనియర్లకు అన్యాయం
గోదావరిఖని: సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి, చీఫ్ మెడికల్ సర్వీసెస్ అధికారులను కాంట్రాక్టు పద్ధతిన నియమించడం సరికాదని అధికారుల సంఘం నాయకులు అన్నారు. ఆర్జీ–1, 2 జీఎంలు లలిత్‌కుమార్, వెంకటయ్యకు బుధవారం వినతిపత్రా లు అందజేశారు. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేశా రు. కొత్త విధానంతో సీనియర్ అధికారులకు అన్యా యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంస్థలో డిపార్ట్‌మెంట్ హెడ్‌లుగా సర్వీస్‌లో లేనిబయటి వ్యక్తులను ని యమించడం సరైంది కాదన్నారు. కష్ట, క్టిష్ట సమయాల్లో సమ్మె సంస్కృతిని పని సంస్కృతిగా మార్చడంలో అధికారుల కృషి ఉందని గుర్తుచేశారు. అనేక వ్యయప్రయాసలకోర్చి, ప్రాణాలకు తెగించి, చిత్త శుద్ధితో అధికారులు పనిచేస్తున్నారన్నారు. కరోనా మహమ్మారితో పోరాడే సమయంలోనే అద్భుత ప నితీరు కనబర్చి ఉద్యోగుల్లో మనోధైర్యం కల్పించా రని పేర్కొన్నారు. ఈక్రమంలో చాలామంది ప్రాణా లు కోల్పోయారని ఆవేదన చెందారు. 30ఏళ్లకు పైబడిన అనుభవం, జవాబుదారీతనంతో పనిచేస్తున్న వారిని కాదని కొత్తపద్ధతిన బయటివారిని నియమించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. దీనిద్వారా భవిష్యత్‌లో సంస్థపై పడే దు ష్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పద్ధతిన నియామకాల ఆలోచనను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సింగరేణి అధికారుల సంఘం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కిరణ్‌రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు చిలుక శ్రీనివాస్, బి.మల్లేశ్‌తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–2 ఏరియాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంవోఏఐ అధ్యక్షుడు పెద్ది నర్సింహులు, నాయకులు ఎస్.మధుసూదన్, చంద్రశేఖర్, నరేశ్, జనార్దన్, సుగుణాకర్, రామకృష్ణ, నితిన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల సంఘం నిరసన
జీఎంలకు వినతిపత్రాలు అందజేత