కోల్‌సిటీ(రామగుండం): ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లతోపాటు రాయితీ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆకాంక్షించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. అరుణశ్రీ మాట్లాడుతూ.. ఈరోజు ఏం సా ధించామో సాయంత్రం అవలోకనం చేసుకోవా లన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి ఆట లు ఉపకరిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి బ హుమతులు అందజేశారు. ఉత్తమ పారిశుధ్య కా ర్మికులను సత్కరించారు. నగరపాలక సంస్థ డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఊర్మిళ, శ్వేత, ప్రి యదర్శిని, శమంత, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నూనె లతామోహన్, ప్రతినిధులు వెంగళ పద్మలత, పరిపూర్ణ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అరుణశ్రీ
బల్దియాలో మహిళా దినోత్సవం