సప్తగిరికాలనీ(కరీంనగర్): సివిల్స్ కొట్టాలన్న కూతురు లక్ష్యానికి వెన్నంటే నిలిచింది ఆ తల్లి.. ఒకసారి ఫెయిలైనా.. రెండోసారి సాధించకున్నా.. సరే అమ్మా అధైర్యపడకూ అంటూ వెన్ను తట్టింది. నువ్వు సాధించగలవు అంటూ ప్రోత్సహించింది. నాలుగోసారి ప్రయత్నంలో ఆ కూతురు ఐఏఎస్ సాధించగా.. ఆ సక్సెస్‌లో తన తల్లి కీలకమంటోందా కూతురు. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక సహన 2023 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ంది. తన తల్లి గీత ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణమని చెబుతోంది. సహన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడాదిపాటు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. తరువాత స్థానికంగానే సివిల్స్‌కు సన్నద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని సాధించింది. 739వ ర్యాంకు సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉంది.
తల్లి గీతతో కూతురు సహన