రామగుండం ఠాణా తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రామగుండం ఠాణా తనిఖీ

Mar 6 2025 1:31 AM | Updated on Mar 6 2025 1:30 AM

రామగుండం: పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ బు ధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సంధ్యారాణితో పలు కేసుల వివరాలు, శాంతిభద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్‌ పరిసరాలు, నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులను పరిశీలించారు.

ఆన్‌లైన్‌లోనే బిల్లుల చెల్లింపు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాల ల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించే నిర్వాహకులకు ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపడతారని మధ్యా హ్న భోజన పథకం రాష్ట్ర అధికారి శశికుమార్‌ తెలిపారు. ఈమేరకు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్‌ను బుధవారం ఆయన సందర్శించా రు. మధ్యాహ్న భోజనం నెలవారీ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు గల సాధ్యాసాధ్యాలపై తాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈమేర కు పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథ కం అమలు తీరుపై ఆరా తీశామన్నారు. సకా లంలో బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం అమలు చేస్తోందని అన్నారు. ప ట్టణంలోని బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశా ల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మ ధ్యా హ్న భోజనం అమలు చేస్తున్న తీరుపై తాను ఆరా తీశానని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంఈవో రాజయ్య, ఎమ్మార్సీ ఉద్యోగులు రజిత, రమేశ్‌, డీఈవో కార్యాలయ ఉద్యోగి రాజు, హెచ్‌ఎంలు శారద, అనిల్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ ప్రాజెక్టు భద్రతకు అధిక ప్రాధాన్యం

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీలో విద్యు త్‌ ఉత్పత్తితోపాటు ప్రాజెక్టు భద్రతకు ప్రాధా న్యం ఇస్తున్నుట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టులో బుధవా రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. విక్షిత్‌ భారత్‌కు భద్రత, శ్రేయస్సు చాలాకీలకమని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో భద్రతా చర్యలను పాటిస్తే ప్రమాదాలను నివా రించవచ్చని సూచించారు. అనంతరం ప్రాజె క్టు గేట్‌ నుంచి సర్వీసు భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

వసతులు కల్పించాలి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉమెన్‌ ట్రా కింగ్‌పై ఏపీఎం, సీఏలకు బుధవారం శిక్షణ ఇ చ్చారు. ఆమె మాట్లాడుతూ, మహిళలు, బాలికలను అపహరణ, అక్రమ రవాణా గురించి తెలిస్తే పోలీస్‌స్టేషన్‌తోపాటు డయల్‌ 100 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఏపీఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎన్టీపీసీలో పునుగుపిల్లి

జ్యోతినగర్‌(రామగుండం) : ఎన్టీపీసీ ప్రాంతంలో అరుదైన పునుగుపిల్లి సంచరించింది. బు ధవారం ఉద యం 10.30 గంటల సమయంలో రా మగుండం బీ–పవర్‌హౌ స్‌ రోడ్డుపై పు నుగుపిల్లి ప్రత్యక్షమైందని స్థానికులు తెలిపా రు. ఇది నక్కను పోలికలు, పులిచారలతో ఉంది. అది కాస్త నీరసంగా కనిపించడంతో స్థాని కులు పట్టుకున్నారు. దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని వారు తెలిపారు.

రామగుండం ఠాణా తనిఖీ 1
1/3

రామగుండం ఠాణా తనిఖీ

రామగుండం ఠాణా తనిఖీ 2
2/3

రామగుండం ఠాణా తనిఖీ

రామగుండం ఠాణా తనిఖీ 3
3/3

రామగుండం ఠాణా తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement