అనేక సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

అనేక సౌకర్యాలు

Aug 18 2024 11:50 PM | Updated on Aug 18 2024 11:50 PM

అనేక

అనేక సౌకర్యాలు

ఆధునిక హంగులు..

పెద్దపల్లిరూరల్‌: కార్పొరేట్‌ కంపనీల అవసరాలకు అనుగుణంగా విద్యావంతులైన యువత వృత్తి నైపుణ్యం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (‘టా స్క్‌’)ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో దీనికి రూపుదిద్దుతున్నారు. ఈఏడాది మార్చి 16న స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, అప్పటి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఈ భవనం పరిశీలించారు. ఐటీ టవర్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక సౌకర్యాలతో, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈమేరకు పనులు చివరిదశకు చేరుకున్నాయి.

నైపుణ్యం ఉంటేనే..

● ప్రస్తుతం ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు యువతలో పోటీ తీవ్రంగా ఉంది.

● ఇందు కోసం యువతకు ప్రతిభ, నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి.

● కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసేందుకు డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ తదితర ఉన్నత విద్యావంతులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రధానలక్ష్యంతో టాస్క్‌ పనిచేస్తోంది.

● కాలేజీల్లో చదివే, చదువు పూర్తయిన యువతకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో మెలకువలు నేర్పించి ఇంటర్వ్యూలను ఎదుర్కొనేలా తయారు చేస్తారు.

ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు..

విద్యావంతులైన యువత సరైన ఉపాధి అవకాశాలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడం చాలా ఖర్చుతో కూడి ఉండడంతో ఆర్థిక స్థోమత లేనివారు స్థానికంగానే ఏదో ఓపనిలో చేరిపోతున్నారు. అలా కాకుండా జిల్లాకు చెందిన విద్యావంతులైన యువతకు మంచి భవిష్యత్‌ అందించాలనే ఆలోచనతో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ చూపి పెద్దపల్లిలో టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు పొందవచ్చు. జిల్లాలోని 14 కాలేజీలకు చెందిన 2,600 మంది విద్యార్థులు టాస్క్‌లో ఇప్పటివరకు నమోదై ఉన్నారు.

ప్రారంభానికి సిద్ధమైన టాస్క్‌ భవనం

విద్యావంతులైన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తాం. ఇందుకోసం ‘టా స్క్‌’ భవనం నిర్మించాం. ఆధునిక హంగులు జోడించాం. పనులు సత్వరమే పూర్తిచేయాలి. ఈనెల 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా ప్రారంభించేందుకు సర్వనన్నద్ధం కావాలి

– కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశం

ఉద్యోగ కల్పనే లక్ష్యం

జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే టాస్క్‌ లక్ష్యం. కంపెనీల అవసరాలు, యాజమాన్యాలు ఆశించేలా శిక్షణ ఇచ్చి ఇంటర్వ్యూల్లో అనుసరించే పద్ధతులపై యువతకు అవగాహన కల్పిస్తాం. ప్రస్తుత పోటీని తట్టుకునేలా నైపుణ్యం పెంపొందిస్తాం. ఆధునిక హంగులు ఉండేలా టాస్క్‌ భవనాన్ని ఆధునికీకరించాం. త్వరలోనే ప్రారంభిస్తాం. – గంగాప్రసాద్‌,

టాస్క్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌

అనేక సౌకర్యాలు 1
1/2

అనేక సౌకర్యాలు

అనేక సౌకర్యాలు 2
2/2

అనేక సౌకర్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement