
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ ఆది నుంచీ ఆధిక్యం కనబర్చింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌ఠాకూర్ తొలిరౌండ్‌లోనే 4,571ఓట్ల ఆధిక్యం కనబర్చారు. ఇలా ప్రతీ రౌండ్‌లో మూడు నుంచి నాలుగువేలకుపైగా మెజా ర్టీ సాధించారు. అన్నిరౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రా జ్‌ఠాకూర్ దూసుకుపోయారు. ఇలా 19రౌండ్లు ము గిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాకూర్ 92,227 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి చందర్‌పై 56,794ఓట్లు ఆధిక్యం సాధించారు. 35,443ఓట్లు సాధించి కోరుకంటి చందర్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి 12,966 ఓ ట్లు సాధించి మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నా రు. స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 4,048 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.