
మాట్లాడుతున్న రవీందర్, సంజీవ్‌కుమార్
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఆది వారం పూర్తయ్యాక, ఆయా ఈవీఎంలను పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని గిడ్డంగుల్లో భద్రపర్చనున్నారు. ఈవీఎంలను భద్రపర్చేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య నిల్వచేసేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
5నుంచి రాష్ట్రస్థాయి జూడో పోటీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలో ఈనెల 5, 6వ తేదీల్లో రాష్ట్రస్థాయి జూడో పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మాటేటి సంజీవ్‌కుమార్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ తెలిపారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్నిజిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు(బాలబాలికలు), 50 మంది కోచ్‌లు, మేనేజర్‌లు, రెఫరీలు హాజరవుతారన్నారు. రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులను ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కేరళలో నిర్వహించే జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ క్రీడా సమాఖ్య మండల కార్యదర్శి దాసరి రమేశ్, ఎస్జీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి అంతటి శంకరయ్య, జూడో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరి మహేందర్, స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు బైరగోని రవీందర్‌గౌడ్, కుమార్ కిశోర్, పీఈటీలు ఇక్బాల్, సత్యనారాయణ, శివ పాల్గొన్నారు.
క్యాంపు ఆఫీసు సిద్ధం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండం, మంథనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తయ్యాయి. కాస్త ఆలస్యంగా పెద్దపల్లిలోనూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం నిర్మించారు. మంత్రి కేటీఆర్ ఇటీవల కాలేజీ మైదానం నుంచే దీనిని ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఈ కార్యాలయం నుంచి ఇంకా పాలన ప్రారంభించలేదు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, పోలింగ్ ప్రక్రియ ముగియడం, ఆదివారం ఓట్ల లెక్కింపునకు సర్వసన్నద్ధం కావడంతో అదరి దృష్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైనే పడింది. విజేతగా నిలిచిన వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు భవనం ముస్తాబైంది. అయితే, ఈ అవకాశం ఎవరికి దక్కుతుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఆకట్టుకున్న ప్రవచనాలు
రామగుండం: స్థానిక శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో శనివారం దేవీభాగవతనామ పు రాణం ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అ ధ్యక్ష, కార్యదర్శులు కోలహాలం శ్రీనివాస్‌రా వు, తాటిపెల్లి శివప్రసాద్ తెలిపారు. తొలిరోజు అఖండ దీపారాధన, పుణ్యహవచనం, అఖండ కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈనెల 9వ తేదీ వరకు దేవీభాగవత పురాణం జరుపుతామని, రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యామ్నం 12.30 వరకు, మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంట లకు భాగవత పురాణం జరుపుతామని వివరించారు. భక్తులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 10న ఫలశృతి చంఢీహవన వేడుకలు నిర్వహిస్తామని, అన్నదానంతో వేడుకలు ముగుస్తాయని పేర్కొన్నారు.

ప్రవచిస్తున్న సత్యనారాయణశర్మ

ముస్తాబైన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు