బధిరులకు ఉచిత టచ్‌ ఫోన్లు | - | Sakshi
Sakshi News home page

బధిరులకు ఉచిత టచ్‌ ఫోన్లు

May 23 2026 12:40 AM | Updated on May 23 2026 12:40 AM

బధిరులకు ఉచిత టచ్‌ ఫోన్లు ● అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం 13,731 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు కార్డు ఉంటేనే యూరియా

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని విద్యావంతులైన బధిరులకు ఉచితంగా టచ్‌ మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేయనున్నట్టు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖాధికారి బి.దేవరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచా ర మార్పిడికి, అత్యవసర పరిస్థితుల్లో ఇవి ఉపయోగపడతాయన్నారు. 18 నుంచి 40 ఏళ్లలో పు వయసు ఉండి, ఇంటర్మీడియట్‌ ఆపై చదు వులు చదువుతున్న, పూర్తిచేసిన బధిరులు ఈ పథకానికి అర్హులన్నారు. దరఖాస్తుదారులు 60 శాతం పైబడి వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్‌, ఆధార్‌, రైస్‌కార్డు, స్థానికత, విద్యార్హత పత్రా లు, ఫొటోలు, ప్రభుత్వాస్పత్రి ఆడియాలజిస్ట్‌ జారీచేసిన ‘సైన్‌ లాంగ్వేజ్‌’ ధ్రువపత్రాలను ముందుగా ఏపీడీఏఎస్‌సీఏసీ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అనంత రం ఆన్‌లైన్‌ రశీదుతో పాటు, ఆయా పత్రాల నకళ్లను జతచేసి తమ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సహాయ సంచాలకుల కార్యాలయ ఫోన్‌ నంబన్‌ 08942–240519ను సంప్రదించాలని కోరారు.

పార్వతీపురం: జిల్లాలో స్వచ్చభారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం–ఫేజ్‌–2) కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి 13,731 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు ఆమోదం లభించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారులతో కలెక్టరేట్‌ లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.అర్జునరావు కలెక్టర్‌కు పలు అంశాలను వివరించారు. మరుగుదొడ్ల నిర్మా ణం కోసం రూ.16.47కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు వెల్లడించారు. ఇంతవరకు జిల్లాలో 36 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తికాగా, మరో 2,477 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.

పార్వతీపురం: జిల్లాలో మే 25 నుంచి జూన్‌ 4 వరకు జరగనున్న ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కానున్నారన్నారు. పరీక్షల నిర్వహణ, పరీక్ష ల నిర్వహణ పరిశీలన కోసం నలుగురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, నలుగురు డిపార్ట్‌మెంట ల్‌ అధికారులతో పాటు సుమారు 20మంది ఇన్విజిలేటర్లను, నిరంతర పర్యవేక్షణ కోసం ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, ఫస్ట్‌ఎయి డ్‌, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రా ల వద్ద గట్టి పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల నుంచి పరీ క్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరు కావాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమీక్షలో డీఈఓ బ్రహ్మజీరావు పాల్గొన్నారు.

అలాగే జిల్లాలో మే 25 నుంచి జూన్‌ 1 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత తెలిపారు. జిల్లాలో మొత్తం 269మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

గజపతినగరం రూరల్‌: రైతులు తప్పనిసరిగా యూరియా కార్డులు కలిగి ఉండాలని, లేనిపక్షంలో యూరియా, డీఏపీ అందించడం జరగదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.టి.రామారావు స్పష్టం చేశారు. మండలంలోని తుమ్మికాపల్లి రైతుసేవా కేంద్రంలో రైతులకు పీఎండీఎస్‌ (నవధాన్యాలు) విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ, యూరియా కార్డ్స్‌ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గజపతినగరం ఏడీఏ గాలి శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి పి.కిరణ్‌ కుమార్‌, ఏఈఓ సతీష్‌, వీఏఏ మస్తాన్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement