● వడదెడ్డతో తల్లీకొడుకుల మృతి
● చలించిపోయిన వీరఘట్టం బీసీ కాలనీ వాసులు
● అంత్యక్రియలకు కులమతాలకు
అతీతంగా తరలివచ్చిన ప్రజలు
వీరఘట్టం: స్థానిక బీసీకాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న సీరాపు పార్వతమ్మ(80), ఆమె కుమారుడు మజ్జీశ్వరరావు(55) లు శుక్రవారం తె ల్లవారుజామున మృతిచెందారు. గడిచిన మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీకొడుకులు వడదెబ్బ వల్లే మృతిచెంది ఉంటారని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. మతిస్థిమితం లేని తన కుమారుడిని పుట్టినప్పటి నుంచి ఏభైఐదేళ్లుగా ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచుతోంది.గురువారం రాత్రి పక్కిండి వారితో కాసేపు మాట్లాడిన తల్లీకొడుకులు తెల్లారేసరికి చనిపోవడంతో ఒక్కసారిగా కాలనీవాసులు అవాక్కయ్యారు. తమకు సంబంధం లేనప్పటికీ అందరూ వచ్చి కన్నీటి పర్యంతమై సంతాపం తెలిపారు. కులమతాలకు అతీతంగా స్థానికులు వచ్చి ప్రత్యేక వాహనంలో శ్మశానవాటికకు సాగనంపారు. దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే దిక్కుగా ఉంటాడని చెప్పడానికి ఈ తల్లీకొడుకుల అంత్యక్రియలే ఉదాహరణగా చెప్పవచ్చు. స్థానికులు మానవతా వాదంతో పెద్ద ఎత్తున పాల్గొని వారి అంత్యక్రియలను వట్టి గెడ్డ ఒడ్డున నిర్వహించారు. తల్లీకొడుకులు యాదృఛ్చికంగా ఒకేసారి మృతి చెందడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.


