కాలిపోయిన టెంట్‌ హౌస్‌, సప్లయర్స్‌ | - | Sakshi
Sakshi News home page

కాలిపోయిన టెంట్‌ హౌస్‌, సప్లయర్స్‌

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

కాలిపోయిన టెంట్‌ హౌస్‌, సప్లయర్స్‌

రూ.20 లక్షల ఆస్తినష్టం

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ

డెంకాడ: మండలంలోని పినతాడివాడ గ్రామంలో మాజీ సర్పంచ్‌, వైఎస్సార్సీపీ నాయకుడు లెంక లక్ష్మణరావు ఇంటి కింది ఫ్లోర్లో ఉన్న టెంట్‌ హౌస్‌, సప్లయర్‌ సామగ్రి అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మాజీ సర్పంచ్‌ లెంక లక్ష్మణరావు ఇంటి కింది ఫ్లోర్లో ఆయన సోదరుడు లెంక గోవిందరావుకు సంబంధించిన టెంట్‌ హౌస్‌, సప్లయర్స్‌ ఉంది. ఇది గురువారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది. కింది భాగం నుంచి పొగలు రావడంతో గమనించిన లక్ష్మణరావు కుటుంబసభ్యులు కిందికి వచ్చారు. వచ్చి చూసేసరికి పెద్దపెద్ద టెంట్లు, సప్లయర్స్‌ సామగ్రి, పెద్ద కూలర్లు వంటివి సమస్తం కాలి బూడిదయ్యాయి. దీంతో రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

పినతాడివాడ మాజీ సర్పంచ్‌, వైఎస్సార్సీపీ నాయకుడు లెంక లక్ష్మణరావు ఇంట్లో జరిగిన అగ్నిప్రమాద పరిస్థితిని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన టెంట్లు, సప్లయర్స్‌ సామగ్రి కూలర్లు తదితరాలను చూశారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని మాజీ సర్పంచ్‌ లక్ష్మణరావు, సోదరుడు గోవిందరావులను ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి తమ్మునాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు బడ్డుకొండ మణిదీప్‌ నాయుడు, బుగత రమణ, పలువురు నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement