అమానుషం
సాలూరు రూరల్: సాక్షి సాలూరు టీవీ రిపోర్టర్ శ్రీనివాస్‌పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు హెచ్.సింహాచలం, బి.అనిల్ ఖండంచారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల పైదాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వారి వెంట ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్, ఎ.గంగారావు ఉన్నారు.
మోహన్‌పై దాడి జరిగిన సంఘటలను గుర్తుచేశారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా పేర్కొన్నారు. నిందితులను పట్టుకోకుంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.
సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై హత్యాయత్నం
దుండగుల దాడితో తీవ్ర గాయాలు
నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ జర్నలిస్టు సంఘాల ఆందోళన
బాధితుడిని పరామర్శించిన జెడ్పీ చైర్మన్, మాజీ డిప్యూటీ సీఎం


