గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో మండలంలోని ప్రజలు భీతిల్లుతున్నారు. నందివానివలసలోని తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు బుధవారం సాయంత్రానికి తోటపల్లి గ్రామ పరి సరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండంతో ఎప్పుడు ఏ గ్రామంలో ఎవరికి హాని చేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


