విజయనగరం రూరల్: విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా జేఎన్‌టీయూ–జీవీ ఫిన్‌సంజీవి ఎడ్యువెల్త్ సర్వీసెస్‌తో బుధవారం అవగాహన (ఎంవోయూ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ–జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు, ఫిన్‌సంజీవి సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీను మాడెం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి అందిపుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఒప్పందంతో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, సంపద నిర్వహణపై అవగాహన, వృత్తి మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడి వ్యూహాలు, ఉద్యోగ అవకాశాలు, వర్క్‌షాపులు, సెమినార్ల నిర్వహణ వంటి కార్యకలాపాలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితంగా అనేక శిక్షణ కార్యక్రమాలు అందించనుందన్నారు.
● ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం
గజపతినగరం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీ కొట్టడంతో ఒవ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం నుంచి విజయనగరం వస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న మరో భారీ వాహనం లైటింగ్ వల్ల ఆగి ఉన్న లారీ కనిపించక పోవడంతో లారీ వెనుక బాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ పక్క సీట్‌లో ఉన్న విజయనగరానికి చెందిన పి.ప్రశాంత్ (36)అనే వ్యక్తి ఎడమకాలికి రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది. దీంతో108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించి వైద్య సేవలు అందించారు. గజపతినగరం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడు ప్రశాంత్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు తరలించారు.అక్కడి నుంచి కుటుంబసభ్యులు ఓప్రై వేట్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. లారీని ఢీకొట్టిన వ్యాన్ ముందు భాగం అంతా నుజ్జునుజ్జయింది. ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు.
గంజాయి ధ్వంసం
విజయనగరం రూరల్: ఎకై ్సజ్ శాఖాధికారులు గతంలో స్వాధీనం చేసుకున్న 841.962 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో వివిధ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వద్ద ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎ.సి పైడి రామచంద్రరావు, ఈఎస్ బమ్మిడి శ్రీనాథుడు, విజయనగరం ఎకై ్సజ్‌స్టేషన్ సీఐ కె.మన్మధకుమార్, ఎస్.కోట సీఐ, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు
త్వరితగతిన అనుమతులు
విజయనగరం గంటస్తంభం: పరిశ్రమల స్థాపన, నిర్వహణకు అవసరమైన అనుమతులను వేగవంతంగా జారీ చేస్తూనే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీపీసీబీ ఈఈ సరిత తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రాలకు అనుగణంగా సీటీఈ, సీటీఓ దరఖాస్తులను ఏపీఓసీఎంఎంఎస్ ద్వారా సులభంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీల పరిశ్రమలకు గడువులోపు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశ్రమల తనిఖీలు క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించి సేవలను వినియోగించుకోవాలని కోరారు.


