● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్‌డీవీ.ప్రసాదరావు
విజయనగరం
గంటస్తంభం:
జిల్లాలోని దుకాణాలు,వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్‌డీవీ.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు ఈ నమోదు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సరైన విధంగా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయగణన ద్వారా కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమ సంఘాలకు చెందిన కార్మికులు తప్పనిసరిగా స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
డెంకాడ: మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో ఉన్న ఎస్‌వీఎస్ ఏపీఎస్‌పీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ, యూకేజీ తరగతులకు ఒక పోస్టు, 1నుంచి 5వ తరగతి బోధించేందుకు ఇంటర్, బీఏ, బీఎస్సీలతో పాటు టీపీటీ, హెచ్‌పీటీ, డీఈడీల అర్హత కలిగిన వారితో 4 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 6నుంచి 10వ తరగతి వరకూ హిందీ బోధించేందుకు బీఏతో పాటు హిందీ పండిట్ విద్యార్హత అని తెలిపారు. కంప్యూటర్ తరగతులు బోధించేందుకు 1 ఉపాధ్యాయ పోస్టు ఉందని, దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బిటెక్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తులను rvremschool @gmail.com గాని, వాట్సాప్ నంబర్ 73282234573కు గానీ పంపగలరన్నారు. అడ్మినిస్ట్రేషన్ 9573184185, స్కూల్ కాంటాక్ట్ నంబర్ 7382234573, బీడబ్ల్యూ అధికారి ఎన్.గణేష్ 9440906345కు ఫోన్ చేసి మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు.


