అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

అంతర్జాతీయ వేదికపై అక్కాచెల్లెళ్లు

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు బెల్లాన హారిక, బెల్లాన భార్గవి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో ఓషియానియా ఖండంలో ఉన్న సమోవాలో జరుగుతున్న యూత్‌ అండ్‌ జూనియర్‌ కామన్‌వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇటీవల బెల్లాన భార్గవి ఒకే రోజు బంగారు, వెండి పతకాలను కై వసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే వేదికపై భార్గవికి స్వయాన అక్క హారిక కూడా బుధవారం పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. అంతర్జాతీయ వేదికపై హారిక అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 110 కిలోలు..మొత్తంగా 197 కిలోల బరువును లిఫ్ట్‌ చేసి విజేతగా నిలిచింది. ఒకే వేదికపై అక్కా చెల్లెళ్ల డబుల్‌ విజయం జిల్లాలో క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది. తల్లిదండ్రులు బెల్లాన శ్రీనివాసరావు, గౌరి ప్రోత్సాహం, కోచ్‌ వల్లూరి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంతో విజయాన్ని సాధించినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపా రు. వారిద్దరికీ జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, సీనియర్‌ కోచ్‌ చల్లా రాము, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ ప్రోత్సహించారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో

పతకాల పంట

ఇటీవల బంగారు, వెండి పతకాలు సాధించిన చెల్లి

తాజాగా బంగారు పతకాన్ని కై వసం చేసుకున్న అక్క

Advertisement
 
Advertisement
Advertisement